సమాజనికి సాయం చేసినోళ్లే గొప్పోళ్ళు

Submitted by sridhar on Wed, 07/09/2022 - 19:22
Those who help the society are great uncles
  • షాద్‌నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ 
  • పెంజర్లలో నిరుపేద కిష్టయ్యకు రెండు ఎడ్లు అందజేత 
  • జర్నలిస్ట్ మధు సుధన్ గౌడ్" కృషితో దాతల ఆర్థిక సహకారం 
  • కార్యక్రమానికి హాజరైన జడ్పిటిసిలు, నాయకులు, జర్నలిస్టులు తదితరులు.. 

సమాజానికి సాయం చేసినోళ్లే గొప్ప వాళ్ళని, జర్నలిస్టులు సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. బుధవారం కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో స్థానిక సర్పంచ్ మామిడి వసుంధరమ్మ ఆమె కుమారుడు మామిడి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నిరుపేద కూలి కిష్టయ్యకు రూ 95 వేల విలువైన రెండు ఎడ్లను  అందజేశారు. కిష్టయ్య ఎడ్లు ఇటీవలే గుర్తుతెలియని దొంగలు దొంగిలించారు. ఎడ్లపైనే జీవనాధారం కొనసాగిస్తున్న కిష్టయ్య దిక్కుతోచని పరిస్థితిలో ఉండగా విషయం తెలుసుకున్న కొత్తూరు జర్నలిస్టు మధుసూదన్ గౌడ్ సాయం కోసం దాతలను అర్జించాడు. పత్రికాముఖంగా అతని కథనాన్ని ప్రచురించాడు. దీనికి స్పందించిన సర్పంచ్ వసుంధరమ్మ ఆయన కుమారుడు సిద్ధార్థ రెడ్డి మొదట పదివేల రూపాయలను సహాయంగా ప్రకటించారు. దీంతో విరాళాల వెల్లువ మొదలైంది.. 95 వేల రూపాయలతో రెండు ఎడ్లు కొనుగోలు చేసి స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మండల ప్రజా ప్రతినిధులు, దాతలు, జర్నలిస్టులు సమక్షంలో కిష్టయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ మాట్లాడుతూ ఎడ్లు ఇచ్చేందుకు పూర్తిస్థాయిలో కృషి చేసినందుకు జర్నలిస్టు మధుసూదన్ గౌడ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు కోన సాగించాలని సూచించారు. అనంతరం మధుసూదన్ గౌడ్ ను శాలువాతో సన్మానించారు.

 వీర్లపల్లి శంకర్ 15 వేల సాయం 

నిరుపేద కిష్టయ్య ఎడ్ల కొనుగోలు కోసం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ 15వేల రూపాయలను అందజేశారు. కిష్టయ్య పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న వీర్లపల్లి శంకర్ ఎడ్ల కొనుగోలు కోసం సాయం చేశారు.

 మేత కోసం ఎంపిటిసి భర్గవ కుమార్ రెడ్డి 2000 సాయం 

ప్రస్తుతం ఎడ్ల సంరక్షణలో భాగంగా మేత కోసం 2000 రూపాయలను ఫరూక్ నగర్ మండలం మధురాపురం గ్రామ ఎంపీటీసీ ఎం. భార్గవ కుమార్ రెడ్డి 2000 రూపాయల నగదు అందరి సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన భార్గవ కుమార్ రెడ్డి.. జర్నలిస్ట్ మధును అభినందించారు. నిరుపేదలకు ఆపత్కాలంలో ఆదుకోవడం గొప్ప విషయం అని పేర్కొన్నారు.

నిరుపేద కిష్టయ్యకు ఎడ్లను సమకూర్చే క్రమంలో తన వార్తకు స్పందించి ఎందరో మహానుభావులు ముందుకు రావడం గొప్ప విషయమని వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటూ జర్నలిస్ట్ మధు తెలిపారు. ఒక కుటుంబాన్ని ఆదుకునేందుకు మానవతామూర్తులు ముందుకు రావడం అభినందనీయమని ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. హలో షాద్ నగర్ జర్నలిస్ట్ డాక్టర్ కెపి చేస్తున్న ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల స్పూర్తితో ఈ కార్యక్రమం తాను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. సాయం కోసం కదిలి వచ్చే ప్రతి మనసుకు ఎల్లప్పుడు మీడియా పరంగా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే పెద్ద మనసుతో వచ్చిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, జర్నలిస్టులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ కేపి, శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్, వైస్ చైర్మన్ డోలి రవీందర్,సర్పంచ్ మామిడి వసుంధరమ్మ, కౌన్సిలర్స్ కోస్గి శ్రీనివాస్, ఎంపీటీసీలు భార్గవ్ రెడ్డి,రాజేందర్ గౌడ్, ఉప సర్పంచ్ పాముల రమేష్, మాజీ ఉపసర్పంచ్ కుమ్మరి రమేష్,బిజెపి యువ నాయకుడు ప్రేమేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మెండే కృష్ణయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేశాల జైపాల్, టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు కడాల శ్రీశైలం, పద్మారావు, దామోదర్ రెడ్డి,దేశాల భీమయ్య,దేశాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.