Telangana

వీఆర్ఏలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Submitted by veerabhadram on Tue, 11/10/2022 - 18:19

చండ్రుగొండ ప్రజా జ్యోతి అక్టోబర్ 11

 వీఆర్ఏలను ముందస్తు జాగ్రత్తలో భాగంగా అదుపులోకి తీసుకోవడం జరిగిందనిఎస్సై విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద నుండి వీఆర్ఏలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ... వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని, అర్హత మేరకు వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలన్నారు. పోలీస్ అదుపులో ఉన్న వారిలో వీఆర్ఏలు చాంద్ మీరా, సైదా, నవీన్,ముత్తయ్య, జయరాజ్,రామకృష్ణ,జానీ, మౌలానా, లక్ష్మీపతి,తదితరులు పాల్గొన్నారు.

కొమ్ముల గూడెం గ్రామంలో బ్రతకమ్మ బృందానికి డీజే సౌండ్ సిస్టం బహుకరణ సోడె పోగు వెంకట ముత్యం

Submitted by veerabhadram on Sun, 02/10/2022 - 13:45

చండ్రుగొండ  ప్రజాజ్యోతి. అక్టోబర్ 2:

 

 చండ్రుగొండ మండలం తుంగారం పంచాయతీ పరిధిలో కొమ్ములగూడెం గ్రామం లో బతుకమ్మ బృందానికి సోడేపోగు వెంకట ముత్యం 75 వేల రూపాయలు విలువైన డిజె సౌండ్ సిస్టం బహుమతిగా ఇచ్చారు. గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తమ, తమ బతుకమ్మలతో, ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో వెంకటముత్యం మాట్లాడుతూ, గ్రామంలో పిల్లలు, పెద్దలు మహిళలు బతుకమ్మ , దసరా పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేల్పుల వీరస్వామి,నోముల వెంకటేశ్వర్లు, సిద్దెల భారతి, చాపలమడుగు భూదేవి, సోడిపోగు పద్మ, సోడెపోగు రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.