కాంటా చేసిన కదలని సంచులు
సదాశివనగర్ నవంబర్ 22 (ప్రజాజ్యోతి)
సదాశివనగర్ మండలం పద్మాజివాడి సొసైటీ పరిధిలోని పద్మాజివాడి, మల్లుపేట్ గ్రామాల్లో వరి ధాన్యం కాంటాలు చేసి రెండు వారాలు గడిచిన ఇంతవరకు తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు అధికారులకు సొసైటీ సిబ్బందికి విన్నవించుకున్న ఫలితం లేకపోవడంతో ఉమ్మడి సదాశివనగర్ మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావుకు ఫోన్ ద్వారా సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన రాజేశ్వరరావు పద్మాజివాడి వరి ధాన్యం కల్లాల కాడికి చేరుకొని సివిల్ సప్లై డిఎం తో ఫోన్లో మాట్లాడారు. ఎట్టి పరిస్థితిలో ధాన్యం తరలించాలని లేదంటే ఆందోళన దిగుతామని హెచ్చరించారు. డి ఎం ఈరోజు సాయంత్రం లోపుగా వరి ధాన్యాన్ని తరలిస్తామని అందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బార్ధాన్ కూడా లేదని చెప్పడంతో వెంటనే పంపిస్తున్నామని హామీ ఇచ్చారు. మల్లుపేట్ గ్రామానికి చెందిన రైతులు కలిసి తమకు కూడా లారీల రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ శ్రీరాములుతో మాట్లాడగా లారీలు వస్తున్నాయని సమాధానమిచ్చారు. 15 నిమిషాల్లో రైతుల వద్దకు వస్తానని ఆయన తెలిపారు. అంతేకాకుండా కాంటా చేసి రెండు మూడు వారాలు దాన్యం అలాగే ఉంచితే తూకంలో తేడా వచ్చి రైస్ మిల్లులు ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ జెడ్పిటిసితో పాటు టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నాగాగౌడ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నర్సారెడ్డి నర్సారెడ్డి రాజారెడ్డి, రాజారెడ్డి, నరసాపురం లింగం, మల్లుపేట్ టిఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రైతులు ఉన్నారు.
