నాగిరెడ్డిపేట్ (లింగంపేట్)ప్రజాజ్యోతి;
భార్య , పిల్లలు ఉండగా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు తండ్రి. తాను పెళ్లి చేసుకునేది ఖాయమని అడ్డుకుంటే ఊరుకునేది లేదని గ్యాస్ లీక్ చేసి ఇంటిని ఖాల్చీ బూడిద చేస్తానని భార్య పిల్లలతో గొడవ పడిన తండ్రి చివరికి కన్న కొడుకు చేతిలో హతమయ్యాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం అయ్యలపల్లి లో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం….గ్రామానికి చెందిన దేవసోత్ పకీరాకు ఇదివరకు పెళ్లి కాగా అతనికి భార్య పిల్లలు ఉన్నారు. ఇటీవల తాను రెండో పెళ్లి చేసుకుంటానని గొడవ పడుతున్నారు. శనివారం రాత్రి తండ్రి ఫకీరా, కొడుకు ప్రకాష్ లు గొడవ పడ్డారు. ఈ విషయంలో ఫకీరా ఇంటిని కాల్చి వేస్తాననని గ్యాస్ సిలిండర్ లీక్ చేసేందుకు యత్నించగా కొడుకు ప్రకాష్ , తండ్రి ఫకీరా తలపై గొడ్డలితో కోట్టగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు లింగంపేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాష్ చదువుకుంటున్నట్లు తెలిసింది.