మున్సిపల్ కోఆప్షన్‌కు 36 నామినేషన్లు..

Bharath Gowd
0 Min Read

నర్సాపూర్‌ (ప్రజాజ్యోతి) నర్సాపూర్‌ పురపాలక కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియలో భాగంగా బుధవారం నామినేషన్ల జోరు కొనసాగింది. గడువు ముగిసే సమయానికి మొత్తం 36 దరఖాస్తులు అందినట్లు ఇంచార్జ్ కమిషనర్ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో మైనారిటీ విభాగం నుంచి 17 (పురుషులు 10, మహిళలు 7), ప్రత్యేక పరిజ్ఞానం విభాగం నుంచి 19 (పురుషులు 11, మహిళలు 8) నామినేషన్లు స్వీకరించినట్లు పేర్కొన్నారు. అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *