నర్సాపూర్ (ప్రజాజ్యోతి) మెదక్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై పెద్ద చింతకుంట గేటు సమీపంలో ఆదివారం విద్యుత్ ప్రమాదం సంభవించింది. పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి, యంత్రంతో కోయగా మిగిలిన ఎండుగడ్డికి మంటలు అంటుకున్నాయి. ఎండ తీవ్రతకు మంటలు ఎగిసిపడటంతో ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు గడ్డి కొంతమేర కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.
