మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్న ప్రముఖులు
పరిగి, ఆగస్టు 23 (ప్రజాజ్యోతి):
ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా పరిగి పట్టణంలోని కుతుబ్ షాహీ జమా మస్జిద్ ప్రాంగణంలో మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మిలాద్ కమిటీ అధ్యక్షులు ఖాజీ ఖాజా అజరుద్దీన్ నేతృత్వంలో జరిగిన ఈ
శిబిరంలో పలువురు ప్రముఖులు పాల్గొని రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ కో-ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు మీర్ మహేమూద్ అలీ మాట్లాడుతూ రక్తదానం చేయడం అత్యున్నత మానవ సేవ అని అన్నారు. ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడగలదని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
శిబిరంలో పిఎసిఎస్ చైర్మన్ పార్థసారథి పంతులు, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు మీర్ తాహేర్ అలీ, రవికుమార్, మీదిగడ్డ శ్రీనివాస్, కే. నరేష్ మాజీ కౌన్సిలర్ మునీర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని అభినందించారు.
అలాగే పెద్ద సంఖ్యలో యువకులు రక్తదానం చేసి సేవా భావాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో బాపయ్య, నయీమ్, ఇసాక్ అలీ, గౌస్, పట్టణ ప్రముఖులు, స్థానిక నాయకులు, మిలాద్ కమిటీ సభ్యులు, యువకులు మరియు ప్రజలు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహకులను పలువురు అభినందించారు.
