కష్టపడితే ఫలితం తప్పదు….

-నాలుగు రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేసిన చేర్యాల యువకుడు నక్క అనిల్

Siddipet Bureau
1 Min Read

చేర్యాల, ఆగస్టు 21 (ప్రజాజ్యోతి):కష్టపడితే ఫలితం తప్పదని, అది ఇవాళ కాకపోయినా రేపైనా తప్పకుండా దక్కుతుందని చేర్యాల పట్టణానికి చెందిన యువకుడు నక్క అనిల్ నిరూపిస్తున్నాడు. సినిమాపై ఉన్న ఆసక్తితో దర్శకత్వ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తూ ‘సంజీవ్’ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించాడు.కేవలం నాలుగు రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి ఇటీవల హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీమియర్ షో నిర్వహించాడు. దర్శకత్వం, నటన రెండింటినీ ఏకకాలంలో నిర్వహిస్తూ సినిమాను పూర్తి చేయడం అనిల్ పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.‘సంజీవ్’ సినిమా ఆగస్టు 21 నుంచి ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చేర్యాల యువకుడు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ఓటీటీలో విడుదల కానుండటంతో స్థానికులు, సినీ అభిమానులు అనిల్‌ను అభినందిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *