ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

Rammoorthy Kamareddy
1 Min Read

ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

— జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకట్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 07(ప్రజా జ్యోతి)

రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వెంకట్ రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. వెంకట్ బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న సేవలు, మందుల లభ్యత, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. ఆసుపత్రిలో పరిశుభ్రతను నిరంతరం పాటిస్తూ, మందులు మరియు ఇతర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.ఆసుపత్రిలో డ్యూటీ చేస్తున్న సిబ్బందిని హాజరు తనిఖీ చేయగా కొందరు గైహాజరైనట్లు తెలిపారు. వీరిపై ఆరోగ్యశాఖ తరఫున శాఖ పరమైన చర్యలు తీసుకోబడుతుందని డిఎంహెచ్వో పత్రిక ముఖంగా తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *