‘సర్’లో పరకాల టాప్‌.. బీఎల్‌ఓ లకు ఘన సన్మానం

Warangal Bureau
1 Min Read
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; algolist: 0; multi-frame: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; motionR: 0; delta:null; bokeh:0; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 3145728;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 253.30011;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 46;

‘సర్’లో పరకాల టాప్‌.. బీఎల్‌ఓ లకు ఘన సన్మానం

ఆత్మకూరు, అక్టోబర్ 6 (ప్రజాజ్యోతి):

ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో పరకాల నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన నేపథ్యంలో, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విశేష కృషి చేసిన ఆత్మకూరు మండల బీఎల్‌ఓలను పరకాల ఆర్డివో డిఎస్ వెంకన్న ఘనంగా సన్మానించారు. మంగళవారం ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆత్మకూరు మండలంలోని బిఎల్ఓ లతో సమావేశం నిర్వహించారు. అనంతరం బిఎల్ఓ లు ఆర్డివో ను శాలువాతో సన్మానించారు. ఓటర్ల వివరాల సేకరణ, ధ్రువీకరణ, డిజిటలైజేషన్‌ తదితర ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించిన బూత్‌ లెవల్‌ అధికారుల సేవలను అధికారులు అభినందించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు, ఇతర ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో పరకాల నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించిందని ఆర్డివో వెంకన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన బీఎల్‌ఓలను శాలువాలతో సత్కరించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన ఓటర్ల జాబితా సవరణను బాధ్యతగా నిర్వహించిన బీఎల్‌ఓలను అధికారులు అభినందించారు. ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియను విజయవంతముగా పూర్తి చేసి పరకాల నియోజక వర్గానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆర్డిఓ కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపిడీవో శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మంజుల, సూపర్వైజర్లు ఆర్ఐ ఫారూక్, ఆర్ఐ హారిక, కిరణ్, కంప్యూటర్ ఆపరేటర్లు, బిఎల్ఓ లు పాల్గొన్నారు.

 
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *