వెనుక నుంచి లారీ ఢీ.. ముగ్గురు మృతి

Rangareddy Bureau
1 Min Read

ఒకే కుటుంబంలో విషాదం.. భార్యాభర్తలు, కుమారుడు దుర్మరణం

ప్రాణాలతో బయటపడిన చిన్నారి

చేవెళ్ల, అక్టోబరు 6 ప్రజా జ్యోతి
వెనుక నుంచి వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన మంగళవారం రాత్రి చేవెళ్ల మండలం గొల్లపల్లి సమీపంలోని రోడ్డు మలుపు వద్ద చోటుచేసుకుంది. మోయినాబాద్‌ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మధు, ఆయన భార్య సావిత్రి, వారి కుమారుడు మృతిచెందినట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో కలిసి చనువల్లి గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గొల్లపల్లి సమీపంలో బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వారితో ఉన్న చిన్నారి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది. చిన్నారికి గాయాలు కావడంతో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న చేవెళ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *