–
మాజీ సర్పంచ్ మధుసూదన్ గుప్తా
– రామాలయం ముందు సొంత నిధులతో సిసి రోడ్డు పనులు ప్రారంభం
చేవెళ్ల, ప్రజా జ్యోతి
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చుతామని దామరగిద్ద మాజీ సర్పంచ్, సర్పంచుల సంఘం రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు రెడ్డిశెట్టి మధుసూదన్ గుప్తా పేర్కొన్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ 9వ వార్డులో రామాలయం ముందు సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన స్వంత నిధులతో ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ కాసుల రాముగౌడ్, కౌన్సిలర్లు బండారి శైలజా ఆగిరెడ్డి, తాళ్లపల్లి నర్సింలు, మంగలి కల్యాణి యాదగిరి, మద్దెల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మలిపెద్ది వెంకటేశం గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ గుప్త మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సమతా వెంకట్ రెడ్డి సహకారంతో వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ బ్యాగరి రాములు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
