కుల బహిష్కరణ అసత్య ప్రచారం
— గోగుల్ తండా కుల సభ్యులు
కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 25 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని గోగుల్ తాండ-2 లో మంగళవారం సంఘ సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని కుటుంబాల వారు సోషల్ మీడియా ద్వారా వివిధ ప్రచార మార్గాల ద్వారా కుల బహిష్కరణ చేశారు అంటూ లేనిపోని అబద్దాలను అంట కడుతున్నారని, అదేవిధంగా మా తండా సభ్యుల సమక్షంలో
మేము మా తండా పరిధిలో ఎవరిని కూడా బహిష్కరించలేదు అదేవిధంగా మాపై తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా స్థానిక పోలీస్ స్టేషన్, మండల తాసిల్దార్ కార్యాలయంలో కుల బహిష్కరణ చేసామని కంప్లైంట్ ఇచ్చారని ప్రచారం మాధ్యమాల ద్వారా తెలవగా వెంటనే మా సంఘ సభ్యులు స్పందించి మేము ఎవరిని బహిష్కరించలేదు ఎవరిని ఉద్దేశించి కక్షపూర్వకంగా ఎవరితో దురుసుగా ప్రవర్తించలేము అదేవిధంగా మా సంఘ కట్టుబాట్లతో అందరం కలిసే ఉన్నాం అని క్లారిటీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ బాదావత్ తిరుపతి, పంతులు, కారోబార్ కిషన్, మోతిరాం, గణేష్, లింబాద్రి, జాను, గోవింద్, సంఘ సభ్యులు తెలపడం జరిగింది.
