యూరియా కోసం రైతుల కడుపు మంట
![]()
![]()
— రాత్రింబవళ్లు పడిగాపులు
— సరిపోయే యురియా ఎప్పుడు పంపిణీ..?
— పోలీస్ పహారా మధ్య పంపిని..!
— రైతులకు అధికారులకు వాగ్వాదం
— యూరియా పంపిణీయు నిలిపివేత..?
— బారులు తిరిగిన రైతులు
— మండి పడ్డ రైతాంగం
రామారెడ్డి సెప్టెంబర్ 4 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలో యూరియా కొరత వలన రైతులు బుధవారం రాత్రి రైతు వేదిక ప్రాంగణంలో పడి గాపులు కాస్తున్న రైతులు యురియా కొరత తీర్చని అధికారులు,గురువారం ఉదయం 4 గంటల నుండి క్యూ లైన్ కట్టడం జరిగింది.తీరా పంపిణీ కి సిద్ధం జరిగిన సందర్భంలో రైతులలో వాగ్వాదం జరగడం వలన పోలీసు సిబ్బంది. కూడా చొరవ చూపడం జరిగింది. అయినా కూడా గొడవలు తోపులాట వాగ్వాదం తీవ్రతరం జరిగింది. రైతులు ఇబ్బందుల కు గురయ్యారు. రైతులు విసిగి వేసరి పోయారు. రైతులు మాట్లాడుతూ చేతికొచ్చిన వరి పంట చివరి దశలో లాస్ట్ దఫా చల్లాల్సిన సమయానికి యూరియా లేకపోవడం తో రైతులు మండిపడ్డారు. భారీ గా వరుసలో నిలుచుండి విసిగి వేసారి పోయారు. వ్యవసాయ శాఖ,ఏవో భాను శ్రీ ,ఆయా గ్రామాల,ఏఈవోల,పరిధిలో పిఎసిఎస్ సెంటర్ ద్వారా పంపిణీ కార్యక్రమంలో రైతులకు అధికారులకు గొడవలు, తోపులాట,లు జరిగాయి యూరియా పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు. దీనితో రైతులు మండిపడ్డారు.యూరియా కూడా సప్లై చేయకుండా నిమ్మకు నీరెత్తిన అధికార యంత్రాంగం, ప్రస్తుతం ఉన్న యూరియాను పంపిణీ చేయలేక వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లిపోవడం జరిగింది. సరిపోయే యూరియా వచ్చాక పంచడం జరుగుతుందని అన్నారు.రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అందరికీ యూరియా సప్లై చేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖ,సిబ్బంది తెలిపారు.

