లక్ష్మీపల్లిలో ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితాపై కలెక్టర్ దీపక్ తివారి ఆకస్మిక తనిఖీ
కోడంగల్ సెప్టెంబర్15 ప్రజా జ్యోతి న్యూస్
కొడంగల్ నియోజకవర్గం కోడంగల్ మండలం లక్ష్మీపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి ఎస్‌ఐఆర్ (SIR) ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఓటర్లకు ఇప్పటికే జారీ చేసిన నోటీసులు, ఇంకా జారీ చేయాల్సిన నోటీసుల వివరాలను కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నోటీసులు ఏయే ఓటర్లకు జారీ చేశారు, ఎన్ని నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి, జారీ చేసిన నోటీసులపై తదుపరి చేపట్టాల్సిన చర్యలు ఏమిటనే అంశాలపై అధికారులతో సమీక్షించారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి వివరాన్ని నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జారీ చేసిన నోటీసుల వివరాలను సక్రమంగా నమోదు చేసి, పెండింగ్‌లో ఉన్న నోటీసులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిపిఓ జయసుధ, తహసిల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో ఉషశ్రీ, పంచాయతీ సెక్రెటరీ నక్షత్ర, సర్పంచ్ లక్ష్మమ్మ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ధర్మపూర్ గ్రామంలో నీటి సమస్యపై
కలెక్టర్ దీపక్ తివారి పర్యవేక్షించారు.
కొడంగల్ నియోజకవర్గంలోని ధర్మపూర్ గ్రామానికి సంబంధించి. తాగునీటి సమస్యను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రామస్థులు ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
గ్రామ సమీపంలోని చెరువుకుంటలో ఉన్న బోర్‌ను వినియోగించి గ్రామానికి తాగునీటి సరఫరా చేయాలని మిషన్ భగీరథ ఈ ఈ రవి కుమార్ మరియు సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బోర్ నుంచి నీటిని గ్రామానికి సక్రమంగా సరఫరా చేసేలా అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని సూచించారు.
ప్రజలకు తాగునీటి కొరత లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
అనంతరం రైతులు తమ పొలాలకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉన్నందున నక్షబాట బీటీ రోడ్డు వేయించవలసిందిగా రైతులు కోరారు.
ఈ కార్యక్రమానికి డిపిఓ జయసుధ, మిషన్ భగీరథ ఈ ఈ రవికుమార్, తహసిల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో ఉషశ్రీ, సర్పంచ్ సౌభాగ్య లక్ష్మి సంబంధిత అధికారులు ఉన్నారు.

