భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
వరంగల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి):
వాతావరణ శాఖ హెచ్చ రికల నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో అతి భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశిం చారు. భారీ వర్షాల నేప థ్యంలో ఆదివారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిం చిన కలెక్టర్.. జిల్లాలో పరి స్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్ర మత్తం చేయడంతో పాటు అవసరమైన సమాచారా న్ని వారికి ఎప్పటికప్పుడు అందించాలన్నారు.చెరువులు, వాగులు, కల్వర్టులు, వంతెనల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాల ని, అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ప్రజలను సురక్షి త ప్రాంతాలకు తరలించేం దుకు అన్ని శాఖల అధికారులు సమన్వయం తో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చోట హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య జాగ్రత్త లపై అవగాహన కల్పించా లని సూచించారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుం డా అన్ని శాఖలు సమన్వ యంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలని డాక్టర్ సత్య శారద సూచించారు.
కంట్రోల్ రూమ్:-
ప్రజల సౌకర్యార్థం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసి న కంట్రోల్ రూమ్ 24 గంట లు అందుబాటులో ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో 9154252936 నంబర్‌కు సమాచారం అందించాలని అధికారులు తెలిపారు.
