పర్యావరణ పరిరక్షణకు లయన్స్ క్లబ్ చేయూత
200 మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ
బీర్కూర్, ప్రజాజ్యోతి, సెప్టెంబర్ 14:
పర్యావరణ పరిరక్షణలో భాగంగా బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో 200 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు నీటి కాలుష్యాన్ని నివారించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ గాండ్ల సాయికృష్ణ, జోన్ చైర్మన్ సితలే రమేష్, సీనియర్ లయన్ మేకల విఠల్, వీరయ్య శెట్టి, కార్తీక్ పటేల్, మేరు భరత్, సుభాష్, రమేష్ శెట్టి, ఆనంద్ పటేల్, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
