10 సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం లో యాదికి రాలేదా అక్క?
కొడంగల్ సెప్టెంబర్ 16 ప్రజా జ్యోతి న్యూస్
తెలంగాణ రాష్ట్ర సేన రాష్ట్రంలో గెలుపొందుతే కుటుంబానికి భూమి ఇస్తాం విద్యా వైద్యం ఉచితం గ అందజేస్తామని అలవి గాని కోరికలతో ప్రజలను మభ్యపెట్టడానికి వస్తున్నారా అక్క ?
పది సంవత్సరాల బి ఆర్ ఎస్ పాలన లో యాదికి రానివి మీరు సొంత పార్టీ పెట్టగానే యాదికి రావడం ఏంటని కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు . కోడంగల్ నియోజకవర్గ ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రశ్న కూడా ఇదే మీ నాన్నగారి పార్టీ పది సంవత్సరాలలో మహారాణిగా ఉంటూ ప్రభుత్వంలో పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అప్పుడు తెలంగాణ ప్రజలు గుర్తుకు రాలేరా అక్క!
