
కొడంగల్ అభివృద్ధి పనులపై మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ పరిశీలన
కొడంగల్ సెప్టెంబర్ 16 ప్రజా జ్యోతి న్యూస్
కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న వైకుంఠధామం నిర్మాణ పనులను కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ పరిశీలించారు అనంతరం హైదరాబాద్–సేడం రోడ్డు, మహబూబ్‌నగర్–తాండూరు రోడ్ల నాలుగు వైపులా స్వాగత ఆర్చ్‌ల నిర్మాణం చేపట్టేందుకు సంబంధిత ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వాగత ఆర్చ్‌ల నిర్మాణానికి అనువైన స్థలాలు, నిర్మాణానికి సంబంధించిన అంశాలను అధికారులతో చర్చించారు. కొడంగల్ పట్టణ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సొంత నియోజక వర్గం కాబట్టి జరుగుతున్న పనులు నాణ్యతతో పాటు అభివృద్ధి పథం పై ముందుకు కొనసాగుతం అని నందారం ప్రశాంత్ తెలిపారు.
