గంగ పుత్ర సంఘం ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి
— గంగపుత్ర సంఘం రామారెడ్డి
రామారెడ్డి జనవరి 29 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి గంగపుత్ర సంఘం అధ్యక్షులు నామాల లింబాద్రి ఆధ్వర్యంలో గంగపుత్ర మూలపురుషుడు ఆరాధ్య దేవుడు జాతిపిత భీష్మ ఏకాదశి పురస్కరించుకొని సంఘ భవనంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భీష్మ ఏకాదశి ఉత్సవ కమిటీ అధ్యక్షులు పిప్పరి లింబాద్రి , మాజీ అధ్యక్షులు పిట్టల గంగయ్య, మాజీ అధ్యక్షులు నామాల నారాయణ, నామాల యాదగిరి, గుడికమిటీ అధ్యక్షులు నామాల రవి, యువజన సంఘం అధ్యక్షులు పిప్పరి మహేష్, పిప్పరి గణేష్ కుల పెద్దలు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమన్ని విజయవంతం చేశారు.
