- జుక్కల్ నియోజకవర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి
నిజాంసాగర్, మే 31 (ప్రజాజ్యోతి)
- జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు మంత్రి పదవి ఇవ్వాలని హసన్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒత్తుగాడి నిఖిల్ కోరారు. జుక్కల్ నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గంగా ఉందని గత పాలనలో కూడా ఈ నాయకుడు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలోకి తీసుకెళ్లలేదన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో చారిత్మాత్మక కట్టడాలు ఉన్నాయని వాటిని గుర్తించి పర్యాటక కేంద్రంగా చేసే నాయకుడు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అని అన్నారు. జుక్కల్ నియోజకవర్గం వేడుకబడిన నియోజకవర్గం ఉందని మంచి నాయకుడు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఎంతో విదేశాల అనుభవజ్ఞుడు మరియు సేవా దృక్పథంతో ఎంతో ఆలోచన విధానాలతో ముందుండి వెనుకబడిన నియోజకవర్గమైన జుక్కల్ ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేస్తాడన్నారు. వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గానికి మంత్రి పదవి ఇచ్చి నియోజకవర్గ అభివృద్ధి వైపు బాటలు వేసే విధంగా చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కోరుకుంటున్నాము.