వెల్దుర్తి (ప్రజాజ్యోతి) జూన్ 21:
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెల్దుర్తిలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహిస్తూ యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సర్పంచ్ ఆదర్శ్ మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద అని పేర్కొన్నారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు.ప్రధానోపాధ్యాయులు సాంబయ్య విద్యార్థులు విద్యతో పాటు ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. యోగా మాస్టర్ శ్రీ మోహన్ రావు విద్యార్థులకు వివిధ యోగాసనాలు, ప్రాణాయామ విధానాలను ప్రదర్శించి వాటి ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించగా, విద్యార్థులు ఉత్సాహంగా యోగా సాధనలో పాల్గొని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల విద్యార్థులు పాల్గొన్నారు.
