నర్సాపూర్ (ప్రజాజ్యోతి) బ్యాంకు క్యూలైన్లో ఖాతాదారుడి ఏమరపాటును ఆసరాగా చేసుకున్న ఇద్దరు దుండగులు 24వ తేదీన తమ చేతివాటం ప్రదర్శించారు. ఎస్ఐ రంజిత్ రెడ్డి కథనం ప్రకారం.. గూడెంగడ్డకు చెందిన పర్వతాలు ఎస్‌బీఐలో ఏటీఎం ఫామ్ నింపి క్యూలైన్లో నిలబడి ఉండగా, పట్టణానికి చెందిన రామారావు, సింహాద్రి అనే వ్యక్తులు తోపులాట సృష్టించి అతడి జేబులోని రూ. 50 వేలు తస్కరించారు. సోమవారం సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరాలు వెల్లడించారు.
