ఆత్మకూరు నూతన సీఐ గా ‘బాబు లాల్’ బాధ్యతల స్వీకరణ
ఆత్మకూరు, సెప్టెంబర్ 2 (ప్రజాజ్యోతి):
ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ నూతన సీఐ ( స్టేషన్ హౌస్ ఆఫీసర్) గా ‘బాబు లాల్’ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2009 బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి. గతంలో ఆయన గీసుకొండ, వరంగల్ ట్రాఫిక్ మరియు టాస్క్‌ఫోర్స్ విభాగాలలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించి, సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. బదిలీపై వచ్చిన ఆయన ఈ రోజు ఆత్మకూర్ పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన ఇన్‌స్పెక్టర్ బాబు లాల్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, నేరాల నియంత్రణకు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్టేషన్ పరిధిలోని ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించవచ్చని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కాగా గతంలో ఆత్మకూరు సీఐ గా బాధ్యతలు నిర్వహించిన సంతోష్ కుమార్ పర్వతగిరి స్టేషన్ కు బదిలీ పై వెళ్లారు.
