ఊరుగొండ లో మహా శివరాత్రి బ్రహ్మోత్సవములు..

Warangal Bureau
1 Min Read

ఊరుగొండ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దేవాలయములో మహా శివరాత్రి బ్రహ్మోత్సవములు, శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవములు నిర్వహించనున్నట్లు అర్చకులు, దేవాలయ అభివృద్ధి కమిటి తెలిపారు. ఈ మేరకు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. తేది. 24-02-2025 సోమవారం రోజున ఉదయం 6:00 గం॥లకు గణపతి పూజ, రుద్రాభిషేకము 8:00 గం॥లకు శ్రీ లక్ష్మీగణపతి, నవగ్రహ, రుద్ర సహిత మహా మృత్యుంజయ హోమము. ఉదయం 11:05 ని॥లకు శ్రీ శివ కళ్యాణ మహోత్సవము, మ॥ 1:00 గం||లకు మహ అన్నదాన కార్యక్రమము, సాయంత్రం ||6.00 గంటలకు గ్రామంలో స్వామివారి ఊరేగింపు జరుపనున్నారు.  తేది. 25-02-2025 మంగళవారం రోజున స్వామి వారికి అభిషేకములు, అర్చనలు, తేది. 26-02-2025 బుధవారం రోజున మహా శివరాత్రి రోజున ప్రాతఃకాల రుద్ర అభిషేకములు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పార్వతీ పరమేశ్వరులు ఆశీస్సులు పొందాలని అర్చకులు, దేవాలయ అభివృద్ధి కమిటి మరియు గ్రామస్థులు కోరారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *