నర్సాపూర్ (ప్రజాజ్యోతి) నర్సాపూర్ సీఐగా రంగాకృష్ణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో తూప్రాన్ సీఐగా పనిచేసిన ఆయన గత నెల సిద్దిపేట కమిషనరేట్‌కు బదిలీ కాగా, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులతో తిరిగి నర్సాపూర్ సీఐగా నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన సీఐ జాన్ రెడ్డి సిద్దిపేట కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన నూతన సీఐ రంగాకృష్ణకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
