- పుర కమిషనర్ సాయికుమార్
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) పట్టణంలోని పలు హోటళ్లపై పుర కమిషనర్ సాయికుమార్ శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వంటశాలల్లో పరిసరాల పరిశుభ్రతను, పదార్థాల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే సహించేది లేదని, నాణ్యత ప్రమాణాల్లో తేడా వస్తే హోటళ్లపై చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హోటళ్లలో నిషేధిత సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. ఆయన వెంట సానిటరీ ఇన్చార్జ్ ఉదయ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
