నర్సాపూర్ (ప్రజాజ్యోతి) అనాథలు, వికలాంగులు, వృద్ధులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పింఛన్లు, ఆధార్ కార్డులు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎం. హేమలత ఆదేశించారు. లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం శివంపేట్ మండల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఆశ్రమాల నుంచి వచ్చిన వినతులపై స్పందించి, అధికారులు పరస్పర సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని ఆమె సూచించారు.
