ఆయిల్ ఫామ్ సాగకు శ్రీకారం.. అధిక రాబడికి మార్గం

Medak Staff Reporter
1 Min Read

• రాబడికి దిక్సూచి ఆయిల్ ఫామ్
• మండల వ్యవసాయ అధికారిని స్వప్న
—————————————
నర్సాపూర్/కౌడిపల్లి (ప్రజాజ్యోతి)

ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను మండల వ్యవసాయ అధికారిని స్వప్న రైతులకు వివరించారు. మండల పరిధిలోని బుజరంపేట గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించే లక్ష్యంతో గురువారం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ కి చెందిన ఆరు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పంట సాగు ద్వారా రైతులు మంచి రాబడి పొంది, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వీలవుతుందని తెలిపారు. 200 రూ. విలువగల ఒక్కో ఆయిల్ ఫామ్ మొక్కను ప్రభుత్వం కేవలం 20 రూ. అందిస్తుందని, సబ్సిడీ రూపంలో సమర్థవంతంగా వినియోగించుకునేందుకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై ప్రభుత్వం భారీ రాయితీ ఇస్తుందని తెలియచెప్పారు. ఎస్టి, ఎస్సీ రైతులకు 100%, జనరల్ రైతులకు 90% వరకు రాయితీ చేకూరుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారినీతో పాటు లీవ్ ఫామ్ టెక్నికల్ శ్రీధర్, రైతులు ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *