- తూప్రాన్ (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 01:
తూప్రాన్ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని తూప్రాన్ పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు తూప్రాన్ సీఐ వెంకటరాజు గౌడ్ మీడియా సమావేశంలో తెలిపారు.
సీఐ తెలిపిన వివరాల ప్రకారం, సూర్యాపేట జిల్లాకు చెందిన మామిడి శ్రీకాంత్ (31) తూప్రాన్‌కు వచ్చి ఆగస్టు 29న రాత్రి ఓ ఇంటి తాళం పగులగొట్టి రెండు గ్యాస్ సిలిండర్లను దొంగతనం చేశాడు. అనంతరం మరో ఇంటి వద్ద పార్క్ చేసిన యాక్టివా స్కూటీని అపహరించాడు. అలాగే సూర్యాపేట హైవే కాలనీలో మరో వాహనాన్ని కూడా దొంగతనం చేసినట్లు విచారణలో వెల్లడైంది.
దొంగతనం చేసిన రెండు గ్యాస్ సిలిండర్లను యాక్టివా స్కూటీపై తరలిస్తుండగా సెప్టెంబర్ 1న కరీంగూడా బ్రిడ్జి వద్ద తూప్రాన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి యాక్టివా స్కూటీ, రెండు గ్యాస్ సిలిండర్లు, మరో ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిందితుడు గతంలో కూడా పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు, అతనిపై నేర చరిత్ర ఉన్నట్లు వెల్లడైందని సీఐ వెంకటరాజు గౌడ్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐతోపాటు తూప్రాన్ ఎస్ఐ గంగరాజు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
