నర్సాపూర్ (ప్రజాజ్యోతి) కుక్కల దాడి నుంచి ఓ జింకను ఆటో డ్రైవర్ చాకచక్యంగా కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. గుమ్మడిదల నుంచి నర్సాపూర్ వైపు వస్తున్న క్రమంలో, అటవీ ప్రాంతంలో నాలుగు కుక్కలు ఒక జింకను చుట్టుముట్టి గాయపరుస్తుండటాన్ని డ్రైవర్ గమనించారు. వెంటనే అప్రమత్తమై కుక్కలను తరిమికొట్టి జింకను రక్షించారు. భయంతో స్పృహ కోల్పోయిన ఆ జింకను తన ఆటోలోనే నర్సాపూర్ అటవీశాఖ కార్యాలయానికి తరలించి అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం జింక సురక్షితంగా ఉందని, వైద్య పరీక్షల అనంతరం తిరిగి అడవిలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు. సకాలంలో స్పందించి మూగజీవిని కాపాడిన ఆటో డ్రైవర్ను పలువురు అభినందిస్తున్నారు.
