మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ హబ్ భవనాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
♦
కొడంగల్ సెప్టెంబర్ ఒకటి ప్రజా జ్యోతి న్యూస్ :
కొడంగల్ నియోజకవర్గం హకీంపేట్ నందు చేపడుతున్న వివిధ భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలనీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఐ ఎ ఎస్
సంబంధిత అధికారులకు ఆదేశించారు.
మంగళవారం దుద్యాల మండలం హకీంపేట్ లో చేపడుతున్నఎడ్యుకేషన్ హబ్ లో ప్రతి ఒక సైట్ ను జిల్లా కలెక్టర్ దీపక్ తివారి గారితో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలు, మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో మాట్లాడారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, కళాశాల లు, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్,ఫిజియోతెరఫీ, వెటర్నరీ కళాశాల, యుంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు వేగవంతం గా జరగాలని, నిర్మాణ పనులన్ని యు నాణ్యతో ఉండాలని, ప్రతి వారం నిర్దారించిన లక్ష్యం మేరకు పనుల పురోగతి ఉండాలన్నారు. ప్రతి సైట్ కు సంబందించిన ప్లాన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎక్కడ ఏమి అవసరమో ప్రపోసల్స్ పంపించాలని, కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేయాలనీ,
విద్యార్థులకు ఆధునిక విద్యా సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందని తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు.
అనంతరం హకీంపేట్ పరిధిలో ప్రారంబానికి సిద్ధం గా ఉన్న జడ్ పి ఎచ్ ఎస్ ఇంటిగ్రెటెడ్ స్కూల్ మరియు కళాశాల పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్,అడిషనల్ ఎస్ పిరాజేష్ మినా,ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్,కోడంగల్ కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, ఇ డబ్ల్యూ ఐ డిసి చీఫ్ ఇంజనీర్ షఫీ మియా, విజయ్ భాస్కర్,డి ఎస్ పి శ్రీనివాస్, తహసిల్దార్ కిషన్ , ఇ డబ్ల్యు ఐ డి సి అధికారులు , ఇంజనీరింగ్ అధికారులు ,సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.
