కోడంగల్ జోనల్ కోకో పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థుల ప్రతిభ

1 Min Read

కోడంగల్ జోనల్ కోకో పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థుల ప్రతిభ

అండర్-17 విభాగంలో ద్వితీయ స్థానం.. పలువురు జిల్లా స్థాయికి ఎంపిక

కోడంగల్, సెప్టెంబర్ 12 (ప్రజాజ్యోతి):మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల బాలుర పాఠశాల మరియు కళాశాల, దౌల్తాబాద్‌కు చెందిన విద్యార్థులు 70వ ఎస్‌జీఎఫ్ (SGF) కోకో టోర్నమెంట్ కం సెలక్షన్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. కొడంగల్ జోనల్‌లో నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు అండర్-17 కోకో విభాగంలో ద్వితీయ బహుమతిని సాధించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడారంగంలో కూడా విద్యార్థులు రాణించాలని సూచించారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో ధైర్యసాహసాలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, గెలుపు-ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం అలవడుతుందని తెలిపారు.
అలాగే పోటీల్లో ప్రతిభ కనబరిచిన కొంతమంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-17 విభాగంలో హర్షవర్ధన్, వేణు, హరి, అఖిలేష్ ఎంపిక కాగా, అండర్-14 విభాగంలో శ్రీకాంత్, రవి, మనోజ్ జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.
జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, కావ్య, లక్ష్మణ్, నరేష్, అనిల్, విట్టల్, సంగప్ప, రాములు, రాధా, అఖిల్, రవి, చక్రవర్తి, నరేందర్, సరోజ, లక్ష్మి, వెంకట్, శరత్, సుమలత, స్వాతి, సంతోష్, కిరణ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *