బ్లాక్‌ స్పాట్లపై అధికారుల ఉమ్మడి తనిఖీ ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు ఆక్రమణదారులకు అక్కడికక్కడే నోటీసులు

Nalgonda Bureau
1 Min Read

చివ్వెంల సెప్టెంబర్ 03(ప్రజాజ్యోతి):జాతీయ రహదారి-65 (ఎన్ హెచ్-65)పై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు.ఇందులో భాగంగా గురువారం సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్‌,సూర్యాపేట ఆర్డీఓతో కలిసి ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌టీఓ అధికారులు చివ్వెంల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు.ఈ సందర్భంగా రహదారిపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న బ్లాక్‌ స్పాట్లను అధికారులు నిశితంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న రోడ్డు భద్రతా ప్రమాణాలను అంచనా వేసి, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వాహనాల వేగాన్ని నియంత్రించడం, అవసరమైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, సైన్‌బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.అదేవిధంగా జాతీయ రహదారిని ఆక్రమించి ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఆక్రమణలను అధికారులు పరిశీలించారు. రహదారిని ఆక్రమించిన వారికి అక్కడికక్కడే నోటీసులు జారీ చేసి, వెంటనే ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్‌, ఆర్‌టీఓ, ఎన్‌హెచ్‌ఏఐ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో చివ్వెంల పోలీస్‌ సిబ్బందితో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *