లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ

Nalgonda Bureau
1 Min Read

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ

చిట్యాల ఏప్రిల్ 21(ప్రజా జ్యోతి)

చిట్యాల మండలం నేరడ ప్రాథమిక పాఠశాలలో నల్లగొండ లయన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో 15 ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో లయన్స్ మదన్మోహన్ రేపాల పాలుగొని ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్న విద్యార్థుల తల్లులకు కుట్టుమిషన్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరము మాట్లాడుతూ ఈ కార్యక్రమం చాలా విశిష్టమైనదని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లులు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగించి కుట్టిన దుస్తులను ప్రదర్శించడం చాలా గొప్పగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగితే చాలామందికి ఉపయోగపడుతుందని భవిష్యత్తులో ఇట్టి కార్యక్రమానికి తన వంతు సహాయంగా మరొక కుట్టు మిషన్ కూడా ఇప్పిస్తానని తెలిపారు. లయన్ అశోక్ రెడ్డి గట్టుపల్లి మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగి సమాజానికి తోటి వారికి ఎంతో కొంత సేవా చేయాలని నలుగురికి ఉపయోగపడేలా ఉండాలని కోరారు ఈలాంటి కార్యక్రమాలు ఎంతో సేవాస్పూర్తినిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు,లయన్ సరళ, లయన్ కోడె సతీష్ కుమార్, చిలుకూరి రామకృష్ణ, అశోక్ రెడ్డి, మామిడి పద్మ,శారద, చంద్రావతి, రేపాల విజయలక్ష్మి, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *