సూర్యాపేట జిల్లా ప్రతినిధి అక్టోబర్ 10(ప్రజా జ్యోతి):అన్నదానంతో ఆకలి తీర్చడం అభినందనీయం అని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు.శనివారం మహాలయ పక్ష అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని రిలయన్స్ ట్రెండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు.స్నేహితులంతా కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.మహాలయ పక్ష అమావాస్య రోజున చేసే అన్నదానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్ వెలుగు వెంకన్న,మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ షఫి వుల్లా, బిఆర్ఎస్ పార్టి రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్,ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు బెలిదె శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి బిక్కుమల్ల కృష్ణ , సోమ ప్రవీణ్, డోగుపర్తి ప్రవీణ్, నాయకులు మొరిశెట్టి శ్రీనివాస్, రాచకొండ శ్రీనివాస్, చల్లా లక్ష్మికాంత్, కక్కిరేణి ప్రసాద్, ముదిరెడ్డి రమణారెడ్డి, పిల్లల రమేష్ నాయుడు, బ్రాహ్మండ్లపల్లి మురళిధర్, తాళ్లపల్లి రామయ్య, పబ్బా ప్రకాష్, కర్నాటి సురేందర్, నిర్వాహకులు గోపారపు రాజు, సుమన్ వెంకన్న, బొల్లం సురేష్, మొరిశెట్టి రాము, చందా రాజశేఖర్, గుడిపాటి రమేష్, బ్లూసీ జానీ, హరీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
