తెలంగాణ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కోదాడ క్రీడాకారుల ప్రతిభ

Nalgonda Bureau
1 Min Read

తెలంగాణ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కోదాడ క్రీడాకారుల ప్రతిభ

పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా జాటిన ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు

 

రాష్ట్రస్థాయి పోటీల్లో కోదాడ క్రీడాకారుల ప్రతిభ

 

కోదాడ టౌన్ ,ఏప్రిల్ 20 (ప్రజా జ్యోతి):

తెలంగాణ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ 2025 పోటీల్లో కోదాడ ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు సత్తా చాటారు. హైదరాబాదులో శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సూర్యాపేట జిల్లాలో కోదాడ ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ కోచ్ పాలడుగు ఖ్యాతి నుంచి శిక్షణ పొందిన 14 మంది క్రీడాకారులు పాల్గొని ఓవరాల్ గా రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచారు. వీరిలో సాధిఖ్, పవిత్ర, సౌజన్య రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నుంచి కాంస్య పతకం అందుకున్నారు. లక్ష్మీ ప్రసన్న, విజయ,మహేశ్వరి, వర్షిత, ఖాతిజాబేగం లు గోల్డ్ మెడల్ అందుకోగా ఊహవిజేత,గౌరీ, అనూష లు వెండి పతకాలను తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా కోచ్ ఖ్యాతి మాట్లాడుతూ తన అకాడమి నుంచి క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచడం తనకు ఎంతో సంతోషకరంగా ఉందని రానున్న రోజుల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కూడా కోదాడ ప్రాంతం నుంచి క్రీడాకారులను తీర్చుదిద్దుతానని తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *