- నర్సాపూర్ ‘అమ్మ నర్సింగ్ హోమ్’ వద్ద బంధువుల ఆందోళనా
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ పసికందు ప్రాణాన్ని బలితీసుకుంది. జ్వరం రావడంతో సోమవారం 8 నెలల బాలుడు మనివర్ధన్‌ను నర్సాపూర్ పట్టణంలోని ‘అమ్మ నర్సింగ్ హోమ్’లో చేర్చారు. అయితే, వైద్యుల నిర్లక్ష్యపూరిత చికిత్స వల్లే తమ బిడ్డ కన్నుమూశాడంటూ తల్లిదండ్రులు, బంధువులు మంగళవారం ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. పసివాడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
