సాగు తీరు మారాలి.. రైతు బాగుపడాలి!

Medak staff Reporter
0 Min Read
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) రైతులు వరి సాగును వీడి, లాభసాటి పంట మార్పిడి చేపట్టాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి సూచించారు. బుధవారం మార్కెట్ యార్డులో ‘రైతు వారోత్సవాల’ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. విచ్చలవిడి ఎరువుల వాడకంతో నేల నిస్సారమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మట్టి పరీక్షల ఆధారంగానే సాగు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ నాగేష్ మాట్లాడుతూ.. సేంద్రియ సాగుపై రతులు దృష్టి సారించాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, వ్యవసాయ అధికారులు దేవ్ కుమార్, దీపిక, ఆర్డీవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *