19 నుంచి రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాలు

Bharath Gowd
1 Min Read
  • గోడపత్రిక విడుదల చేసిన గౌడ సంఘం సభ్యులు

నర్సాపూర్‌ (ప్రజాజ్యోతి) స్థానిక సంగారెడ్డి మార్గంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ 15వ వార్షికోత్సవాలను ఈ నెల 19, 20 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు గౌడ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికను వారు ఆవిష్కరించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ.. 19న ఉదయం గణపతి పూజ, ధ్వజారోహణము, మధ్యాహ్నం అమ్మవారి కల్యాణోత్సవం, ప్రసాద వితరణ, సాయంత్రం ఊరేగింపు ఉంటాయన్నారు. 20న చండీ హవనము, సామూహిక కుంకుమార్చనలు, బోనాల ఊరేగింపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజుల పాటు భక్తులకు అన్నదానం ఉంటుందని, ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నర్సాపూర్ గౌడ సంఘం సభ్యులు పాప గారి యాదాగౌడ్, డి.అశోక్ గౌడ్, ఏ.వెంకటేష్ గౌడ్, ఏ.బిక్షపతి గౌడ్, కె.లక్ష్మీనారాయణ గౌడ్, డి.సత్యం గౌడ్, పి.సత్యనారాయణ గౌడ్, ఏ.శ్రీనివాస్ గౌడ్, డి.అంజనేయులు గౌడ్, పాపగారి రమేష్ గౌడ్, రామకృష్ణ గౌడ్, నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *