అక్రమంగా నల్ల మట్టిని తెగ తోడేస్తున్నారు..?
— నల్లమట్టి కి అనుమతులు ఉన్నట్లా లేనట్లా..?
— వ్యవసాయ భూమి పేరిట తరలింపు..?
— ప్రభుత్వ అనుమతులు ఎక్కడ వీరికి వర్తించవా..?
— కోట్ల రూపాయల విలువ చేసే నల్ల మట్టి
— చోద్యం చూస్తున్న అధికారులు..?
— తీసిన మట్టి పై చర్యలు తీసుకుంటారా లేదా..?
— మండలానికి కూతవేటు దూరంలో
రామారెడ్డి జూన్ 11 (ప్రజా జ్యోతి)
మండల మండల కేంద్రానికి అతి సమీపంలో ఊతవేటు దూరంలో ఓ గ్రామంలోని చెరువులోని నల్ల మట్టి నీ అక్రమంగా కమర్షియల్ పర్పస్ కొరకు కొందరు చెరువుల్లో పగలూ రాత్రి అనే తేడా లేకుండా మరీ తెగ తవ్వేస్తున్నారు.ఇటుక బట్టీల అవసరాలకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల విలువ చేసే మట్టిని తోడేస్తున్నారు. ఒకవేళ అనుమతి ఉంటే గోరంత అనుమతికి కొండంత తరలింపు. అనుమతి తీసుకొని, నిత్యం వందల ట్రిప్పుల నల్ల మట్టిని ట్రాక్టర్ల ద్వారా పరిమితికి మించి తరలిస్తున్నారు.
నల్ల మట్టి కోసం…..!
మండల కేంద్రానికి సుమారు 5 కిలోమీటర్ల కూతవేటు దూరంలో చెరువులో మట్టిని తెగ తోడేస్తున్నారు. నిబంధనలు విస్మరించి తగుతున్న పట్టించుకోని వైనం..?
ఒకవేళ అనుమతి గోరంత తవ్వేది కొండంత..?
నిత్యం పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో సరఫరా ఉదయం, రాత్రి తేడా లేకుండా. ఇంతవరకు తరలించిన మట్టిపై అధికారులు స్పందిస్తారా లేదా వేచి చూడాల్సిందే? అయితే తవ్విన మట్టిపై చర్యలు ఎలా తీసుకుంటారు. అదేవిధంగా తవ్విన మట్టి ఎక్కడికి వెళ్ళింది దీనిపైన విచారణ చేపడతారా లేదా? చెరువు సమీపంలోని సంబంధిత అనుమతి లేని మట్టికుప్పలపై లేదా డంపు చేసిన మట్టి పై మండల అధికారులు లేదా ఇరిగేషన్ అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారు.
ఇదంతా అక్రమార్కులకు పరిపాటి….?
మామూలుగా పరిమితి తీసుకున్న.. లేక తీసుకోకపోయినా తరలింపు చర్యలో భాగంగా సీజ్ చేసినా సాధారణ జరిమానాతో మళ్లీ పర్మిషన్?
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి..!
చెరువుల్లో మట్టి తోడేళ్లు పడ్డాయి. పగలూ రాత్రి అనే తేడా లేకుండా మరీ తవ్వేస్తున్నాయి. ఇటుక బట్టీల అవసరాలకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల విలువ చేసే మట్టిని తెగ తోడేస్తున్నాయి. ఒక బట్టీ పేరిట అనుమతి తీసుకొని, నిత్యం వందలాది ట్రాక్టర్లు లేదా టిప్పర్రు పరిమితికి మించి తరలించుకుపోతున్నాయి. ఒకవేళ స్వాధీనం చేసుకున్న ఎడల మట్టికి కొంత మొత్తంలో ఫైన్ తీసుకొని మళ్లీ పరిష్మన్ ఇవ్వడం సర్వసాధారణంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.?
ఇంత జరిగినా చర్యలు తీసుకునేనా…?
వాస్తవానికి నల్ల మట్టి అవసరం ఉన్న కమర్షియల్ వ్యక్తులు తమ సొంత పూచికత్తుతో తాసిల్దార్ కార్యాలయంలో కానీ, లేదా ఇరిగేషన్ కార్యాలయంలో సంబంధిత ధ్రువపత్రాలను జతపరిచి ఎంత మేరకు మట్టి అవసరం ఉందో అంత మట్టిని తీసుకోవడానికి అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి. తదుపరి అధికారులు ఆ యొక్క స్థలాన్ని పర్యవేక్షించి ఈ యొక్క భూమి ఉపరితలం నుండి ప్రభుత్వ అనుమతుల మేరకు ఈ స్థాయిలోతువరకు మట్టిని తీసుకోవచ్చు అని అనుమతి ఇస్తే తదుపరి అవసరమున్న వ్యాపారి లేదా ఇతరులు ఆ యొక్క మట్టిని వాహనాల ద్వారా తీసుకువెళ్లి డంపు చేసుకోవచ్చు అవసరాలకు వాడుకోవచ్చు ఇది ప్రభుత్వం చెప్తున్న నిబంధనలు,
నిబంధనలు విస్మరిస్తున్నాయి..?
ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆ చెరువులో నల్ల మట్టి ఏమైంది. ఎక్కడికి వెళ్ళింది. ఎలా తరలించారు. ఎందుకోసం తరలించారు. ఆ మట్టి డంపు ఎక్కడ ఉంది. తీసిన మట్టి పై చర్యలు ఎలా తీసుకుంటారు. సీనరేజీ చెల్లించలేదు? ప్రభుత్వాన్నిబంధన మేరకు క్యూబిక్ మీటర్ కు పై ప్రభుత్వానికి ఎంత సీనరేజీ చెల్లించాలి. ఈ యొక్క సంఘటనపై మండల అధికారులే గానీ జిల్లా అధికారులే కానీ స్పందిస్తారా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ అనుమతులు లేకుండా నల్లమట్టి తరలించడం చట్టరీత్యా నేరం. చెరువులు, కుంటలు, లేదా వ్యవసాయ భూములలో అనుమతులు లేకుండా మట్టిని తవ్వడం వల్ల పర్యావరణానికి, భూగర్భ జలాలకు నష్టం జరుగుతుంది.నల్ల మట్టిని తరలించాలని భావిస్తే, స్థానిక ప్రభుత్వ నిబంధనలను పాటించాలి.
నల్ల మట్టి కావాలనుకునే రైతులు నేరుగా దరఖాస్తు..!
స్థానిక వ్యవసాయ భూమికి అయితే రైతుల పట్టాదార్ పాస్ బుక్ తో తహసీల్దార్ కార్యాలయంలో భూమి వివరాలతో ధరఖాస్తు చేసుకోవాలి. లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయం అనుమతితో వాళ్లు చూపించిన పరిమితుల అనుగుణంగా వ్యవసాయదారులు ఎలాంటి షరతులు లేకుండా నల్ల మట్టిని తీసుకెళ్లడానికి అభ్యంతరాలు ఉండవు.
కమర్షియల్ పర్పస్ కొరకు..!
చెరువు నుండి అక్రమంగా నల్ల మట్టిని తరలిస్తున్న వారు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ప్రభుత్వ అనుమతితోప్రభుత్వానికి టన్నుల వారీగా సీనరేజీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
తాసిల్దార్ ను వివరణ కోరగా..!
ఈ విషయంపై మాకు ఎలాంటి సమాచారం లేదు ఒకవేళ సమాచారం అందితే మా సిబ్బందిని పంపిస్తాం. ఇంతవరకు మా దృష్టికి రాలేదు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి మా సిబ్బందితో పరిశీలించి పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా మట్టిని తరలించిన వారిపై ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు ప్రస్తుతం చెరువులో నుండి వాహనాల ద్వారా కమర్షియల్ పర్పస్ నల్లమట్టి పై ఎవరికి కూడా అనుమతులు లేవు ఇవ్వలేదు. అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రజలు కూడా సహకరించాలి. ముఖ్యంగా అధికారులు పర్మిషన్ మాత్రం పరిమితులకు లోబడిగుంతలు పడకుండా, పరిమిత లోతు వరకే మట్టిని తవ్వడానికి అధికారులు అనుమతిస్తారు.చాలా ప్రాంతాలలో మట్టి మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండా చెరువుల్లో మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయంపై స్థానికులు, పరిధిలోని ఇరిగేషన్, రెవెన్యూ,లేదా మైనింగ్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. బాధ్యతాయుతంగా పర్యావరణాన్ని పరిరక్షించాలి అని వివరణ ఇవ్వడం జరిగింది.
