నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది

Warangal Bureau
1 Min Read

నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది

* జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి

దామెర/ఊరుగొండ, మే 06 (ప్రజాజ్యోతి):

 

నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా, దామెర మండలం, ఊరుగొండ గ్రామంలోని పోలేపాక శ్రీకాంత్ అభినయ యొక్క ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉండాలని ఆయన అన్నారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్బంగా నూతన గృహ ప్రవేశం చేసుకున్న దంపతులు ముఖ్య అతిధిని శాలువాతో సత్కారించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోలేపాక శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షులు నల్ల సుధాకర్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్ను రామచందర్, బిక్షపతి, వీరయ్య, గొల్లపల్లి రవి, రమేష్, సిలివేరు నర్సయ్య, పోలేపాక ప్రశాంత్, రాజయ్య, సాంబయ్య, పోలేపాక క్రాంతి, మల్లాడి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *