ఆ భూముల జాడేదీ.?..
21 వేల ఎకరాల ప్రభుత్వ భూములేవి.?…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భూభాగోతం…
ధరణీ పేరుతో ప్రభుత్వ భూములకు ఎగనామం…
రెవెన్యూ అధికారుల చేతి వాటం… రికార్డులు మాయం…
(ఎడ్ల సంజీవయ్య – నిజామాబాద్)
ప్రభుత్వ భూములపై లెక్కలు వేసేందుకు వైఎస్ఆర్ ప్రభుత్వం ల్యాండ్ బ్యాంక్ పేరుతో పూర్తి వివరాలను సేకరించింది. అ తర్వాత ప్రజలకు, ప్రజా అవసరాలకు, వరిశ్రమలకు అనుకూలంగా ఉన్న భూములను మూడు కెటాగిరిలుగా విడదీసీ జాబితాలను తయారు చేసారు. ఈ జాబితా ప్రకారం అప్పటి జిల్లా కలెక్టర్లు అ భూములను తగిన జాగ్రత్తలు చేసి నిఘా వేసారు. అదే ఆధారంతో రెవెన్యూ అధికారులకు బాధ్యతలను అఅప్పగించారు. ఇలా అప్పటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు విభాగాల్లో 21 వేల 576 ఎకరాల భూమిని ప్రభుత్వ అధికారులు గుర్తించారు. మొదటి విభాగంలో 37 చోట్ల 2వేల 548 ఎకరాలు, రెండో విభాగంలో 69 చోట్ల 6 వేల 14 ఎకరాలు, మూడో విభాగంలో 205 చోట్ల 13 వేల 13 ఎకరాల భూమిని గుర్తించి వాటికి కావాల్సిన భద్రత ఏర్పాట్లు చేసారు. ఇలా మొత్తం నిజామాబాద్ ఉమ్మడి (నిజామాబాద్, కామారెడ్డి) జిల్లాలో 311 చోట్ల 21 వేల 576 ఎకరాలు గుర్తించారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ 2015 తర్వాత ఈ భూముల జాడ కనుమరుగు అవుతూ వస్తుంది. బిఅర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాడిన ధరణీ పోర్టల్ ప్రభుత్వ భూములు అన్యాకాంతం అవుతూ వచ్చాయి. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి సంక్షేమం పేరుతొ, భూమి
కోనుగోలు పేరుతో ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములను మాయం చేసారు. కొన్నిచోట్ల రెవెన్యూ రికార్డులను సైతం తారుమారు చేసారు. మరికోన్ని చోట్ల కబ్జాలు చేసి దర్జాగా అనుభవిస్తున్నారు.
భూముల లెక్కలు ఇవి…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 21 నేల 576 ఎకరాల భూమిని మూడు బాగాలుగా విభజించారు. వీటిలో అన్ని విధాలుగా ఉపయోగకరమైన భూమిని ఏ గ్రూపుగా, చిన్న చిన్న కుంటలు, చెట్లు ఉన్న భూమిని బి గ్రూపుగా, కొండలు, చిన్న చిన్న కమతాలంగా ఉన్న భూమిని సీ గ్రూపుగా విభజించారు. ఇలా ఏ గ్రూపులో 37 చోట్ల 2 వేల 548 ఎకరాలు, బి గ్రూపులో 69 చోట్ల 6 వేల 14 ఎకరాలు, సీ గ్రూపులో 205 చోట్ల 13 వేల 13 ఎకరాలను గుర్తించారు. ఇలా మొత్తం 311 చోట్ల 21 వేల 576 ఎకరాల భూమి ఉంది. వీటిలో అలాగే 100 ఎకరాల లోవు తాడు 261 చోట్ల 7 వేల 246 ఎకరాలు, 2 వందల ఎకరాల లోపు 20 చోట్ల 3 వేల 891 ఎకరాలు, 5 వందల ఎకరాల లోపు 15 చోట్ల 4 వేల 330 ఎకరాలు, వేయి ఎకరాల లోవు 3 చోట్ల 1715 ఎకరాలు, నేయి ఎకరాలకు పైన ఉన్న వాటిని మూడు చోట్ల 4 వేల 391 ఎకరాలను గుర్తించారు. ఇలా మూడు గ్రూపులుగా అయిదు విభాగాలుగా భూములను సర్వేచేసి గుర్తించి కార్మలు నమోదు చేసారు. కానీ ఇప్పుడు అ ధికారులు వూర్తిగా గల్లంతు అయ్యాయి. కనీసం జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నా ప్రభుత్వ భూమి లేదనే సమాధానం వస్తుంది. దీంతో అసలం ప్రభుత్వం గుర్తించి భూములు ఏమాయ్యాయి.? ఎవరి కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయో.? తొక్కలు తెలాల్సిన అసవరం ఉంది.
ధరణితో దగా…
బిఅర్ఎస్ హాయంలో వచ్చిన ధరణీ పోర్టల్ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఏకంగా కబ్జాలకు గురి చేసి తప్పుడు రికార్డులు తయారు చేసి ధరణీలోకి ఎక్కించుకున్నారు. ముఖ్యంగా వ్రజావ్రతినిధులు, అధికారులు ఇందులో కీలక పాత్ర ఉంది. ఉదహరణకు మాక్లూర్ మండలంలో ఉన్న వందల ఏకరాల అసైన్మెంట్, ప్రభుత్వ భూముల రికార్డులను మాయం చేసి కొందరు ఏకంగా అసైన్మెంట్ భూముల పేరా వట్టా పాసు వుస్తకాలు పొందారు. అ భూమిపై ఏన్ని ఫిర్యాదులు వచ్చిన అధికారులు వట్టించుకున్న పాపానపోలేదు. ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసారు. వీటిని ధరణీ పోర్టల్ రాగానే లక్షల రూపాయాలు లంచాలుగా ఇచ్చి రికార్డులను తారుమారు చేసారు. మరోవైవు అనే వట్టా పాసు పుస్తకాలను చూపి లెక్కకు మించిన ధరకు భూములను అమ్ముకున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయిన అధికారులు అటువైవునకు కన్నెత్తి చూడటం లేదు.
