ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు తగదు…

Kamareddy
1 Min Read

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు తగదు…

అభివృద్ధి చూసి ఓర్వలేక తప్పుడు వార్త కథనాలు

తప్పుడు కథనాన్ని ప్రచురించిన దినపత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి…

కాంగ్రెస్ నాయకులు డిమాండ్

కామారెడ్డి ప్రతినిధి, (ప్రజాజ్యోతి):మే 09

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అవినీతి లేని మంచి పరిపాలన అందిస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుపై అసత్య ఆరోపణలు చేయడం తగదని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసారు. ఓ దినపత్రికలో తప్పుడు కథనాలను ప్రచురించారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని,ఎక్కడా ఒక పైసా కూడా అవినీతి లేకుండా నిజాయితీగా ఎమ్మెల్యే పని చేస్తున్నారని అన్నారు.శుక్రవారం ఓ దినపత్రికలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పై,అసత్య కథనాలను ప్రచురించారని,ఆ కథనంలో ఇలాంటి నిజాలు లేవని
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని,అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న ఏకైక నాయకుడు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అని, అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కావాలనే రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి కథనాలను ప్రచురిస్తున్నారని వారు మండిపడ్డారు. నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ఎల్లారెడ్డి అభివృద్ధికి పాటుపడుతున్న ఏకైక నాయకుడు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అని,అలాంటి నాయకుడిపై దుష్ప్రచారం చేయడం సరికాదని ఎద్దేవా చేశారు.ఓ పత్రికలో డబ్బులు ఇవ్వలేదనే కారణంతో కావాలనే అసత్య వార్తలు ప్రచురిస్తున్నారని,ఈ వ్యవహారంపై సంబంధిత దినపత్రిక యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వెంటనే స్పందించకపోతే సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభిమానులు,కాంగ్రెస్ శ్రేణులు, యువ నాయకులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *