సమయస్ఫూర్తితో డోజర్ బండితో మంటలను అదుపు చేసిన డ్రైవర్ ప్రవీణ్..

Warangal Bureau
1 Min Read

*సమయస్ఫూర్తితో డోజర్ బండితో మంటలను అదుపు చేసిన డ్రైవర్ ప్రవీణ్.*

*​ఘటనా స్థలాన్ని పరిశీలించి, డ్రైవర్‌ను సన్మానించిన ఎస్ఐ.*

నెక్కొండ మండలం అమీన్ పేట వద్ద మొక్కజొన్న ఆరబోసిన సెంటర్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో మొక్కజొన్న పట్టాలు, గింజలు మంటల్లో దహనమవుతుండగా, డోజర్ డ్రైవర్ ప్రవీణ్ తన చాకచక్యంతో వ్యవహరించారు. డోజర్ బండి సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ మహేందర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి మంటలను ఆర్పిన డ్రైవర్ ప్రవీణ్‌ను ఎస్ఐ అభినందించి, సన్మానించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *