చేపల పెంపకం – నాటు కోళ్ల యూనిట్లను పరిశీలించిన అధికారులు
గాంధారిసెప్టెంబర్11 (ప్రజాజ్యోతి)
గాంధారి మండలంలోని గాంధారి, పొతంగల్ కుర్ధు గ్రామాల్లో గురువారం సెర్ప్ ప్రాజెక్ట్ మేనేజర్లు డాక్టర్ సతీష్, డాక్టర్ నేహా మొబైల్ ఫిష్ యూనిట్, చేపల పెంపకం, నాటు కోళ్ల పెంపకం యూనిట్లను సందర్శించారు.ఈ సందర్భంగా మొబైల్ ఫిష్ యూనిట్ సభ్యురాలు లత, నాటు కోళ్ల పెంపకం సభ్యురాలు సౌందర్యకు పలు సూచనలు చేసి ఉత్సాహపరిచారు.ఈ కార్యక్రమంలో డీపీఎం సురేశ్, ఏపీఎం ప్రసన్నకుమార్, సీసీలు రాములు, కాంతారెడ్డి, కె.రాజయ్య, అకౌంటెంట్ సుధాకర్, వీ.ఓ.ఏలు మోహన్ రెడ్డి, లక్ష్మీదేవి పాల్గొన్నారు.
