తూప్రాన్ (ప్రజాజ్యోతి) మే 13:
తూప్రాన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా రెండేళ్లపాటు సమర్థవంతంగా సేవలందించిన రంగకృష్ణ బదిలీపై ఇతర ప్రాంతానికి వెళ్లగా, ఆయన స్థానంలో వెంకటరాజ్ గౌడ్ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు రంగకృష్ణ కి ఘన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. తన పదవీకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన ఆయన సేవలను పలువురు ప్రశంసించారు. ముఖ్యంగా నేరాల నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారం, పోలీస్-ప్రజల మధ్య విశ్వాసం పెంపొందించడంలో ఆయన చూపిన చొరవను గుర్తుచేశారు.వీడ్కోలు సందర్భంగా రంగకృష్ణ మాట్లాడుతూ, “తూప్రాన్ ప్రజల సహకారం, పోలీస్ సిబ్బంది అండతోనే విధులను విజయవంతంగా నిర్వహించగలిగాను. ఇక్కడ పనిచేసిన అనుభవం ఎప్పటికీ మరిచిపోలేను” అని తెలిపారు.అనంతరం నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరాజ్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.
