చేర్యాల మే11(ప్రజాజ్యోతి): వడ్లు జల్లిపట్టే యంత్రంలో తలవెంట్రుకలు ఇరుక్కుని మహిళా కూలీ మృతి చెందిన హృదయ విధారక సంఘటన చేర్యాల మండలం కాశగుడిసెల గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… చేర్యాల మండలం కాశి గుడిశెలకు చెందిన షేక్ ఇమాంబి(50) అనే మహిళ కూలీ ప్యాడి క్లీనర్లో వడ్లు శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె తల వెంట్రుకలు యంత్రంలో చిక్కుకోవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి భర్త, నలుగురు కుమార్తెలు ఉన్నారు.కొన్ని నెలల క్రితం కుమారుడు అనారోగ్యంతో మరణించడంతో ఈ కుటుంబంలో మరోసారి తీవ్ర విషాదం నెలకొంది.సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న చేర్యాల ఎస్ఐ గూడ అపూర్వ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
