మెరుగైన సేవలు అందించడానికి మీనాక్షి హాస్పిటల్ ప్రారంభోత్సవం

Rammoorthy Kamareddy
2 Min Read

మెరుగైన సేవలు అందించడానికి మీనాక్షి హాస్పిటల్ ప్రారంభోత్సవం

కామారెడ్డి టౌన్ అక్టోబర్ 10 (ప్రజాజ్యోతి)

కామారెడ్డి జిల్లా కేంద్రంలో రామారెడ్డి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మీనాక్షి హాస్పిటల్ ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్కరికి మీనాక్షి హాస్పిటల్ ద్వారా మెరుగైన సేవలు పొందాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కామారెడ్డి ప్రాంతంలో నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం ఆసుపత్రి అనేది కేవలం వైద్యం అందించే ప్రదేశం మాత్రమే కాదు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆశను, ఆపదలో ఉన్నవారికి భరోసాను, వారి కుటుంబాలకు ధైర్యాన్ని అందించే పవిత్రమైన సేవా కేంద్రంగా ఈ ఆసుపత్రి సేవలు కొనసాగుతాయని డాక్టర్ సురేష్(ఎంబిబిఎస్, ఎండి) జనరల్ ఫిజీషియన్ & షుగర్ వ్యాధి నిపుణులు మరియు డాక్టర్ మీనాక్షి (ఎంబిబిఎస్, ఎమ్మెస్) గైనకాలజిస్ట్ మాట్లాడుతూ..

వైద్యం ఒక వృత్తి మాత్రమే కాదు అది మానవత్వానికి చేసే గొప్ప సేవ

అని మనం గుర్తుంచుకోవాలి అని తెలియజేశారు.ఈ నూతన ఆసుపత్రి ద్వారా మన ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి ఉంటాయని ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో వైద్యం అందించి, ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రత కల్పించడంలో ఈ ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తుందని తెలియపరిచారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబ్బీర్ అలీ,మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సందీప్, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, పండ్ల రాజు, అశోక్ రెడ్డి, చాట్ల రాజేశ్వర్, నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు లడ్డు, సత్యం, సిద్దిక్, అంజాద్, చిట్టిబాబు, గంగాధర్, ముబషీర్, గొనె శ్రీనివాస్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, రాజగౌడ్, మోహన్ రెడ్డి, SC సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, ఎస్టి సెల్ జిల్లా అధ్యక్షులు రెడ్డి నాయక్, నౌసిలాల్, గణేష్ నాయక్, రాము కుమార్, నాయకులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *