ప్రతి ఒక్కరు సేవా భావాన్ని కలిగి ఉండాలి 

Nalgonda Bureau
1 Min Read

సూర్యాపేట జిల్లా ప్రతినిధి అక్టోబర్ 10 (ప్రజా జ్యోతి): ప్రతి ఒక్కరు సేవాభావాన్ని కలిగి ఉండాలని అభయ సేవాసమితి సభ్యులు అన్నారు. శనివారం మహాలయ పక్ష అమావాస్య తిధి సందర్భంగా పట్టణంలోని అలంకార్ థియేటర్ రోడ్డులో అభయ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా తోట శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని దానాలలో అన్నదానం గొప్పదని అన్నారు.అన్నదానంతో ఆకలి తీర్చడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందన్నారు.మహాలయ పక్ష అమావాస్య తిధిన చేసే అన్నదాన చాలా ప్రాముఖ్యతని కలిగి ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అభయ సేవా సమితి సభ్యులు గుడిపాటి సురేష్, గుండా శంకర్, బక్కవరపు శ్రీను, దేవరశెట్టి సత్యనారాయణ, గజ్జల మురళి, టివిటి రంగనాథ్, తోట శ్రీను, అర్వపల్లి వెంకన్న, బూర్లె మదుసూదన్, మురారిశెట్టి శ్రీధర్, పొన్నాల ఉదయ్, పోతుగంటి మనోహర్, ఓరుగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *